మ‌హేష్ సినిమా కోసం సుక్కూకి క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్

Tue,April 24, 2018 01:47 PM
sukumar high remuneration for mahesh next movie

కెరీర్‌లో ప్రతి సినిమాని చాలా లాజిక్‌గా తెర‌కెక్కించే సుకుమార్ ఇటీవ‌ల విడుద‌లైన రంగ‌స్థ‌లం చిత్రాన్ని ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్నిసాధించింది. ప్ర‌స్తుతం ఈ స‌క్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు సుక్కూ. ఇక రెండు ఫ్లాపుల త‌ర్వాత భ‌ర‌త్ అనే నేను చిత్రంతో భారీ హిట్ కొట్టాడు మ‌హేష్ బాబు. రెండు రోజుల‌లోనే ఈ సినిమా వంద కోట్ల గ్రాస్‌ని రాబ‌ట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ మ‌హేష్ స్టామినా ఏంట‌నేది మ‌రోసారి నిరూపించింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మంచి విజ‌యాలు అందించిన సుకుమార్‌, మ‌హేష్‌లు త్వ‌రలో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నార‌ట‌. ఇప్ప‌టికే వీరిద్దరి కాంబినేష‌న్‌లో 1 నేనొక్క‌డినే మూవీ రూపొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌డంతో నెక్స్ట్ సినిమా విష‌యంలో అలా జ‌ర‌గ‌కుండా చాలా ప‌క్కాగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయ‌బోతున్నాడ‌ట సుక్కూ. జూన్ నుండి స్క్రిప్ట్ ప‌నులు మొద‌లు పెట్ట‌నున్న సుక్కూ 2019లో మూవీ విడుద‌ల చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్నిమైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్నార‌ని తెలుస్తుండ‌గా, ఈ ప్రాజెక్ట్ కోసం 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకోబోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త ఫిలింన‌గ‌ర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి దీనికి సంబంధించి ఏదైన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌స్తుందేమో చూడాలి.

4535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles