జిగేల్ రాణి సింగ‌ర్‌కి ల‌క్ష సాయం చేసిన సుకుమార్

Sat,July 21, 2018 09:23 AM
sukumar helps to jigelu rani singer

రంగ‌స్థ‌లం సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో, మ్యూజిక్ కూడా అంతే హిట్ అయింది. చంద్ర‌బోస్ లిరిక్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి ప్రాణంగా నిలిచాయి. అయితే ఈ సినిమాలో జిల్ జిల్ జిగ‌లే రాణి అనే మాస్ మ‌సాలా పాట పాడిన గంటా వెంక‌ట ల‌క్ష్మీ త‌న‌కి అన్యాయం జ‌రిగిందంటూ మీడియా ముందు వాపోయింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చిన్న చిల్లర కొట్టు నడుపుకుంటూ జీవనం కొనసాగించే గంటా వెంకటలక్ష్మికి సినిమాలో పాడే అవ‌కాశం నాగ‌భూష‌ణం అనే మ‌ధ్య‌వ‌ర్తివ‌ల‌న వ‌చ్చింద‌ట‌. పాట పాడినందుకు ఇచ్చే పారితోషికం మొత్తం తానే తీసుకున్నాడ‌ని, మాకు ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేదని ఇటీవ‌ల త‌న‌ గోడు వెళ్లబుచ్చింది.

కొన్ని రోజులుగా వెంక‌ట‌క్ష్మికి సంబంధించిన ఈ వార్త వెబ్ సైట్స్ లో వ‌స్తుండ‌డంతో, ఈ విష‌యం సుకుమార్‌కి చేరింది. వెంట‌నే ల‌క్ష రూపాయ‌ల చెక్కుని ‘జిగేల్ రాణి’ సింగర్ వెంకట లక్ష్మికి పంపించి అండగా నిలిచారు. వంద రోజుల వేడుక‌కి ఆమెని పిల‌వాల‌ని ప్ర‌య‌త్నించాం కాని ఆమె ఫోన్ నెంబ‌ర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో కుద‌ర‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు సుకుమార్. బుర్ర‌క‌థ‌లే జీవ‌నాధారంగా బ్ర‌తుకున్న వెంకట‌ల‌క్ష్మీ బుర్రకథను ఓ రోజు యూట్యూబ్‌లో చూసారు దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ . ఆమెతోనే జిగేల్ రాణి సాంగ్ పాడించాల‌ని భావించి అవకాశం ఇచ్చారు. ఈ పాట పాడటం కోసం విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లి అక్కడే రెండు రోజులు ఉండి పాట పాడి వచ్చింది వెంక‌ట‌ల‌క్ష్మి.

7037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS