శివ‌నాగులు పాట మార్చ‌డానికి గ‌ల కార‌ణం చెప్పిన సుక్కూ

Wed,April 4, 2018 09:46 AM
Sukumar gives clarity on shiv nagulu song

మ‌న దేశంలోనే కాకుండా విదేశాల‌లోను బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ సునామి సృష్టిస్తున్న చిత్రం రంగ‌స్థ‌లం. గ్రామీణ నేప‌థ్యంలో సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు సాధించింది. ఓవ‌ర్సీస్‌తో పాటు ఆస్ట్రేలియాలోను ఈ మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. రంగ‌స్థ‌లం చిత్రంకి ద‌ర్శ‌క‌త్వం, న‌టీన‌టుల‌ ప‌ర్‌ఫార్మెన్స్‌, సినిమాటోగ్ర‌ఫీ ఎంత ప్ల‌స్ అయిందో వాటితో స‌మానంగా దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం కూడా సినీ ల‌వ‌ర్స్‌ని ఎంత‌గానో అల‌రించింది. సినిమా నుండి విడుద‌లైన ఐదు పాట‌ల‌కి మ్యూజిక్ ల‌వ‌ర్స్ మురిసిపోయారు. చిత్రంలో ఆ గ‌ట్టునుంటావా అనే ఫోక్ సాంగ్ పెట్ట‌డం కాస్త కొత్త‌గా అనిపించిన దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట‌ని జాన‌ప‌ద క‌ళాకారుడు శివ నాగులు పాడారు. అయితే వెండితెర‌పై శివ నాగులు గాత్రంకి బ‌దులు దేవి వాయిస్ వినిపించింది. దీంతో అంద‌రు ఖంగు తిన్నారు.

ప్రీ రిలీజ్ వేడుక‌లో శివ‌ నాగులుని స్టేజ్ పైకి పిలిపించి సాంగ్ బాగా వచ్చింద‌ని చెప్పిన దేవి, సినిమాలో ఎందుకు మార్చారంటూ ట్విట్ట‌ర్‌లో ప్రశ్న‌ల వ‌ర్షం కురిసింది. ఇటీవ‌ల జ‌రిగిన థ్యాంక్స్ మీట్‌ త‌ర్వాత‌ మీడియా సుకుమార్‌ని ఇదే ప్ర‌శ్న అడిగింది. దీనిపై సుకుమార్ సానుకూలంగా స్పందించారు. ఆ గ‌ట్టునుంటావా అనే సాంగ్ షూట్ చేసే స‌మ‌యానికి శివ‌నాగుల‌తో పాట రికార్డు కాలేద‌ని అన్నాడు. దేవిశ్రీ పాడిన వ‌ర్షెన్‌తోనే షూటింగ్ కానిచ్చాము. తరువాత శివ నాగులుతో పాట రికార్డ్‌ చేసినా.. రీ రికార్డింగ్ సమయంలో ఈ వర్షన్‌కు లిప్‌ సింక్‌ కాకపోవటంతో దేవీ శ్రీ ప్రసాద్ వర్షన్‌ను అలాగే ఉంచేశామని సుకుమార్‌ వెల్లడించారు. అయితే ఆల్బమ్‌లో ఎప్పటికీ శివ నాగులు పాడిన పాటే ఉంటుందని, పాటను ఉద్దేశ పూర్వకంగా మార్చలేదని కేవలం టెక్నిక‌ల్ ప్రాబ్లమ్స్ వ‌ల‌నే అలా జ‌రిగింద‌ని సుకుమార్ అన్నారు.

4101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles