రంగ‌స్థ‌లం కాపీ వార్త‌ల‌పై సుకుమార్ క్లారిటీ

Tue,May 29, 2018 10:11 AM
sukumar clarity on rangasthalam copy issue

ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కి స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌లై వేస‌విలో చ‌ల్ల‌ని వినోదాన్ని అందించిన చిత్రం రంగ‌స్థ‌లం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 200 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందిన ఈ చిత్రంలో కొన్ని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో న‌చ్చాయి. ప్ర‌కాశ్ రాజ్ త‌ప్పు చేశాడ‌ని తెలిసిన ఆయ‌న‌ని బ్ర‌తికించి మ‌రీ చంప‌డం అనేది చిత్రానికి హైలైట్‌. అయితే ఈ లైన్‌ని సుకుమార్ త‌న ద‌గ్గ‌ర నుండి కాపీ కొట్టార‌ని ర‌చ‌యిత ఎం.గాంధీ ర‌చ‌యిత‌ల సంఘానికి ఫిర్యాదు చేశాడు.

గాంధీ కంప్లైంట్‌పై ర‌చ‌యిత సంఘం నుండి, ద‌ర్శ‌కుడి నుండి క్లారిటీ వ‌చ్చింది. రంగ‌స్థ‌లం కాపీ అనే విష‌యంపై ఆరు పేజీల ద్వారా సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు. ఎం.గాంధీ ఎవరో తనకుగాని, తన నిర్మాతలకుగాని తెలియదని, ఎప్పుడూ కలవలేదని, కాబట్టి ఆయన కథను తాము కాపీ చేసే ఆస్కారమే లేదని సుకుమార్ తెలిపారు. అంతేకాదు బేసిక్ పాయింట్‌ని ధ‌ర్మ యుద్ధం సినిమా చూసిన‌ప్ప‌టి నుండి అనుకుంటున్న‌ట్టు చెప్పిన సుక్కూ, ఆ పాయింట్ చాలా పాత సినిమాల్లో, నవలల్లో ఉన్నదే అని, దాన్ని తాను ఏ విధానంతో రాసుకుంది అని వివ‌ర‌ణ ఇచ్చారు . సుకుమార్ ఇచ్చిన ఈ సమాధానంతో సంతృప్తి చెందిన రచయితల సంఘం ఈ సమస్యను రచయితల సంఘం పరిష్కరింప‌లేద‌ని గాంధీకి తెలియ‌జేస్తూ, దీనిపై ఇంకా న్యాయం పొందాలి అనుకుంటే న్యాయస్థానం ద్వారా ప్రయత్నించవచ్చని అనుమతిచ్చింది. ర‌చ‌యిత‌ల సంఘం, సుకుమార్‌లు రాత పూర్వ‌కంగా ఇచ్చిన వివ‌ర‌ణ కోసం క్రింద లెట‌ర్స్ చ‌దవండి.
2698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS