మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం?

Tue,April 18, 2017 02:46 PM
suicide attempt near mani ratnam home

ప్రేమ కథా చిత్రాల దర్శకుడు మణిరత్నం తాను తెరకెక్కించిన చెలియా చిత్రాన్ని ఇటీవలే విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఈ దర్శకుడికి అనుకోని సవాల్ ఒకటి ఎదురైంది. మణిరత్నం గతంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలలో గురు అనే చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా ఎంత ఘోర పరాజయాన్ని అందించింది అనే విషయాన్ని ప్రక్కన పెడితే ఈ సినిమాకు లైట్ మ్యాన్ గా పనిచేసిన మణిమారన్ అనే వ్యక్తి మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించడం సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే మణిమారన్ కొన్నాళ్ళుగా రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యానికి చాలా ఖర్చు అవుతుండడంతో తనకు సాయం చేయాలని గురు సినిమా టీంని, లైట్ మ్యాన్ సంఘంని కొంత సాయం చేయాలని కోరాడట. వారి నుండి ఎలా స్పందన రాకపోవడంతో తనకు జరిగిన అన్యాయంపై కోర్టులోను పోరాడట. కోర్టు సానుకూలంగా స్పందించి రూ. 2లక్షలు చెల్లించాలి అని తీర్పు ఇచ్చిందట. కాని ఇప్పుడు ఆ డబ్బులు అడిగితే 20 వేలు లంచం అడుగుతున్నట్టు తెలిపాడు మణిమారన్. పదేళ్ళ నుండి తన వైద్య ఖర్చులన్నీ కుటుంబమే భరిస్తుందని, ఇప్పటికైనా న్యాయం జరగకపోతే మణిరత్నం ఇంటిముందు సూసైడ్ చేసుకుంటానని లైట్ మ్యాన్ చెప్పడం కోలీవుడ్ సంచలనంగా మారింది. మరి దీనిపై మణిరత్నం టీం కాని గురు టీం కాని స్పందిస్తుందేమో చూడాలి.

1504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles