'సుయిధాగా' ట్రైల‌ర్‌కి టైం ఫిక్స్‌

Fri,August 10, 2018 12:13 PM
Sui Dhaaga trailer released on aug 13

వ‌రుణ్ ధావ‌న్, అనుష్క శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ‌ర‌త్ క‌ఠారియా తెర‌కెక్కిస్తున్న చిత్రం సుయి ధాగా. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మౌజీ, మ‌మ‌త పాత్ర‌ల‌లో వ‌రుణ్‌, అనుష్క న‌టిస్తున్నారు. ఈ చిత్రం మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం కోసం వరుణ్ ధావన్ మిషన్ కుట్టడం నేర్చుకుంటే, అనుష్క శర్మ ఎంబ్రాయిడరీ నేర్చుకుంది. చిత్రానికి సంబంధించి విడుద‌లైన ఫోటోల‌లో అనుష్క‌ డీ గ్లామ‌ర్ లుక్ లో చాలా అందంగా క‌నిపించింది. తాజాగా వ‌రుణ్ ధావ‌న్, అనుష్క శ‌ర్మ ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ‌రుణ్ మెడలో టేపుతో మెషీన్‌పై కూర్చొని ఉండ‌గా, పక్క‌న ఉన్న అనుష్క చీర‌లో సింపుల్‌గా ఉంది. చిత్ర ట్రైల‌ర్‌ని ఆగ‌స్ట్ 13న విడుద‌ల చేస్తుండ‌గా, మూవీని సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేశారు మేక‌ర్స్‌. ఈ సినిమా కోసం ప్ర‌ధాన పాత్ర దారులు ఇద్ద‌రు చాలా క‌ష్ట‌ప‌డ‌గా, సినిమా ఫ‌లితం వారి క‌ష్టం క‌నుమ‌రుగ‌య్యేలా చేస్తుంద‌ని అంటున్నారు మేక‌ర్స్‌.

814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS