స్పెషల్ కేక్ పై 80వ దశకం నాటి తారలు

Sat,November 25, 2017 04:27 PM
suhasini shares cake of 1980 group

80వ దశకంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటీ నటులందరు ప్రతి సంవత్సరం పర్టిక్యులర్ ప్లేస్ లో థీమ్ పార్టీ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసారి మహాబలిపురం వద్ద సముద్రతీరంలో రెండు రోజుల పాటు ఈ వేడుక జరుపుకున్నారు . 80వ సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో జరిగిన ఈ వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమకి చెందిన స్టార్స్ అందరు ఒకే రంగు దుస్తులు ధరించి తమ సహనటులతో కలిసి సందడి చేసారు. 28 స్టార్స్ పర్పుల్ కలర్ డ్రెస్ ధరించి గ్రూప్ ఫోటోలకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ఓ కేక్ తయారు చేయించినట్టు సుహాసిని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ కేక్ భూపేశ్ అనే చెఫ్ తో ప్రత్యేకంగా తయారు చేయించగా, దీనిపై ఉన్న పిక్ రెండోసారి కలిసినప్పుడు దిగిన ఫోటో అని సుహాసిని తెలిపారు. అంతే కాక తన కో స్టార్స్ కోసం ఇంట్లో తయారు చేయించిన తినుబండారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎనిమిదో సారి కలిసి రెండు రోజల పాటు ధీమ్ పార్టీ చేసుకున్న వారిలో చిరంజీవి, వెంకటేశ్, సురేశ్, భానుచందర్, శరత్కుమార్, నరేష్, రెహమాన్, జయసుధ, రాధిక, శోభన, సుహాసిని, ఖుష్బూ, రమ్యకృష్ణ, సుమలత, నదియ, రాధ, లిజీ, రేవతి తదితరులు ఉన్నారు.
1400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS