వైఎస్ ఆర్ బయోపిక్ లో అలనాటి అందాల తార..!

Thu,June 14, 2018 04:06 PM
Suhasini Maniratnam plays Sabitha Indra Reddy role

టాలీవుడ్ లో రూపొందుతున్న బయోపిక్స్ లో సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తి చూపుతున్న బయోపిక్ యాత్ర ఒకటి. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది. చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. గతంలో రౌడీ కూలీ, సూర్య పుత్రులు, స్వాతి కిరణం వంటి తెలుగు చిత్రాల్లో నటించిన మమ్ముట్టి పాతికేళ్ల తర్వాత యాత్ర మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

యాత్ర సినిమా కోసం మహి వి రాఘవ ముఖ్య పాత్రలని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేశాడు. ఇక వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళిని ఎంచుకున్నారు. షర్మిళ పాత్ర కోసం భూమికని ఎంపిక చేసారని వార్తలు రాగా వాటిని భూమిక కొట్టి పారేసింది. ఇక ఇప్పుడు వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో అలనాటి అందాల తార సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్. సబితా పాత్రలో సుహాసిని సరిగ్గా సరిపోతారని భావించిన చిత్ర బృందం ఆమెని సంప్రదించినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.

3454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles