మ‌ణిర‌త్నం ఆరోగ్యంపై వ‌చ్చిన పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చిన సుహాసిని

Tue,June 18, 2019 10:04 AM
Suhasini Clarified About The Health Condition Of Mani

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఆరోగ్యంకి సంబంధించి సోమ‌వారం ప‌లు రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గుండె సంబంధింత వ్యాధితో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చేరార‌ని జోరుగా ప్ర‌చారం చేశారు. దీనిప సుహాస‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. నా భ‌ర్త త‌దుపరి సినిమా కోసం ఉద‌యం 9:30 గంటలకే ఆఫీస్ కు వెళ్లారు. నేను తదుపరి సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో ఇంట్లో బిజీగా ఉన్నాను. నా భర్త ఉదయం చేసిన రోటి, మామిడికాయ పచ్చడి ఇష్టంగా తిని నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ కోసం ఆఫీస్ కు వెళ్ళారు అని సుహాసిని తెలిపింది. దీంతో మ‌ణిర‌త్నం ఆరోగ్యానికి సంబంధించి వ‌స్తున్న పుకార్ల‌కి బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం మ‌ణిరత్నం పొన్నియన్ సెల్వం చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా ఇందులో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది.


1299
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles