షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కొత్త లుక్ చూశారా? వైరల్ ఫోటోలు

Fri,May 31, 2019 07:14 PM
Suhana Khan New Look From Family Wedding goes viral

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల తమ ఫ్యామిలీ వెడ్డింగ్‌కు సుహానా ఖాన్ కోల్‌కతా వెళ్లిందట. అక్కడ పెళ్లిలో సుహానా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తన కజిన్ అలియా ఛిబాతో కలిసి ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను అలియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. నారింజ, రెడ్ షేడ్స్ ఉన్న ఆలీవ్ ఆకుపచ్చ రంగు చీరను సుహానా కట్టుకొని లేత ఆకుపచ్చ చీర కట్టుకున్న అలియాతో ఫోటోలకు పోజిచ్చింది.

ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు.. సుహానా అందాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు. సుహానా పెద్ద పెద్ద జుమ్కీలు పెట్టుకొని ఫోటోలో మెరిసిపోయింది. అదే పెళ్లిలో హంగామా చేసిన సుహానా తల్లి గౌరీ ఖాన్ కూడా ఓ ఫోటోను షేర్ చేసింది. పెళ్లి కంటే ముందు జరిగిన మెహెందీ వేడుకలో పాల్గొన్న సుహానా.. తన కజిన్స్ సందడి చేసిన ఫోటోలను కూడా అలియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. మెహెందీ సెరమనీలో సుహానా పిస్తా గ్రీన్ సల్వార్ సూట్ వేసుకుంది. అలియా.. వైట్ అండ్ వైట్ వేసుకొని మెరిసింది.


View this post on Instagram

Shaadi hai ... bride was the best dancer ❤️

A post shared by Gauri Khan (@gaurikhan) on


4961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles