మ‌హేష్ బావ‌ కారు నెట్ట‌డం వెనుక ఉన్న కార‌ణం ?

Sun,September 15, 2019 07:30 AM

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బావ సుధీర్ బాబు ప్ర‌స్తుతం బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లో న‌టించేందుకు సిద్ద‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం సుధీర్ చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూనే త‌న శ‌రీరాకృతి కోసం ఎక్స్‌ట్రా టాస్క్‌లు చేస్తున్నాడు. రీసెంట్‌గా త‌న కారుని వెనుక నుండి నెడుతూ చెమ‌ట‌లు కార్చాడు. ట్రైన‌ర్ స‌ల‌హాల‌తో కారుని కొద్ది దూరం నెట్టాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. సుధీర్ బాబు వీ అనే చిత్రంలోను న‌టిస్తున్నాడు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాని ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.
3823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles