చ‌ర‌ణ్‌కి విల‌న్‌గా క‌న్న‌డ హీరో

Sun,April 29, 2018 12:59 PM
sudeep plays villain role in rc12

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం విజ‌యోత్సాహంతో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 12వ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, బోయ‌పాటి కొన్ని యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వివేక్‌ ఒబెరాయ్, ప్ర‌శాంత్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తిక‌ర వార్త టాలీవుడ్‌లో వినిపిస్తుంది. ఈగ‌లో విల‌న్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకున్న క‌న్న‌డ హీరో సుదీన్ ఈ సినిమాలోను విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు . చ‌ర‌ణ్‌, సుదీప్‌ల మ‌ధ్య ఫైటింగ్ సీన్స్‌ని అంచ‌నాల‌కి మించేలా తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఈ సినిమాలో చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. డీవివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. ఈ మూవీకి రాజ‌వంశ‌స్థుడు అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం .

3987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles