పెద్ద మ‌న‌సు చాటుకున్న క‌న్న‌డ స్టార్ హీరో

Sun,December 9, 2018 12:10 PM
sudeep helps to rahul

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ సోష‌ల్ స‌ర్వీస్ చేయ‌డంలో ఎప్పుడు ముందుంటాడ‌నే విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రోసారి పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు. బెంగ‌ళూర్‌లో నివ‌సిస్తున్న రాహుల్ అనే ప‌న్నెండు సంవ‌త్స‌రాల బాలుడు బ్రెయిన్‌ ట్యూమర్, రక్తస్రావం వ్యాధితో పడుతున్నాడు. బాలుడి శస్త్ర చికిత్సకు రూ. 8 లక్షలు ఖర్చువుతాయని వైద్యులు సూచించారు. పేద వారైన రాహుల్ త‌ల్లితండ్రులు క‌ష్టం మీద నాలుగు ల‌క్ష‌ల వ‌ర‌కు స‌మ‌కూర్చుకోగ‌లిగారు. మిగ‌తా నాలుగు ల‌క్ష‌ల కోసం రాహుల్ త‌న అభిమాన హీరో సుదీప్‌ని ట్విట్ట‌ర్‌లో కోరాడు. అభిమాని పరిస్థితి తెలుసుకున్న సుదీప్ వెంట‌నే త‌న ట్విట్ట‌ర్‌లో స‌మాధాన‌మిస్తూ.. తనని స్వయంగా వచ్చి కలవాలని సూచించాడు. అభిమాని ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు క‌న్న‌డ స్టార్ వెంటనే స్పందించ‌డం చూసిన నెటిజ‌న్స్ ప్ర‌శంసలు కురిపిస్తున్నాడు. తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితం అయిన సుదీప్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు3738
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles