సైరా సెట్‌లో అడుగుపెట్టిన బిగ్ బీ.. ఎమోష‌న‌ల్ అయిన సుదీప్

Sat,March 16, 2019 09:56 AM
sudeep emotional tweet ABOUT BIG B

బాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్న అమితాబ్ బ‌చ్చ‌న్ మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సైరా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌గురువు పాత్ర‌లో అమితాబ్ క‌నిపించనున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన ఓ షెడ్యూల్‌లో పాల్గొన్న అమితాబ్ మ‌ళ్ళీ టీంతో క‌లిసారు. నాలుగు రోజులు చిత్రీకరణలో పాల్గొంటే అమితాబ్‌ పాత్ర మొత్తం పూర్తయిపోతుంది. అయితే చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన అమితాబ్‌ని చిరంజీవి ఆప్యాయంగా ఆహ్వానించారు. సీన్లు గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నారు. క‌న్న‌డ హీరో సుదీప్ కూడా ప్ర‌స్తుత షెడ్యూల్‌లో పాల్గొంటుండ‌గా, అమితాబ్‌తో క‌లిసి ఫోటో దిగారు. ఆ ఫోటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టారు.

10 ఏళ్ల క్రితం ర‌న్న్ అనే చిత్రం కోసం అమితాబ్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఇప్పుడు సైరాతో మ‌రోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. త‌న జీవితం మొత్తాన్ని సినిమాకే అంకితం చేసి మ‌న‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్న లెజెండ్‌తో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. అమితాబ్‌తో న‌టించే అవ‌కాశం నాకు ఇచ్చిన నిర్మాత రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు. మీ ప్రేమ‌కి నేను ధ‌న్యుడిని అని ట్వీట్‌లో తెలిపారు సుదీప్‌. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ శివార్ల‌లో వేసిన భారీ సెట్‌లో జ‌రుగుతుంది. ఈ నెల‌లో జ‌రిపే షూటింగ్‌తో 95 శాతం సినిమా పూర్త‌వుతుంద‌ని అంటున్నారు. ద‌స‌రా కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి,త‌మ‌న్నా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తుండ‌గా, ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

2940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles