మోహన్ బాబు సర్ తో పనిచేయడం గొప్ప అనుభూతి..

Mon,June 17, 2019 04:15 PM
Such a pleasure to be work with mohanbabu sir says suriya


ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య . ఈ చిత్రంలో కలెక్షన్ సింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మోహన్ బాబుతో తొలిసారిగా కలిసి నటించే అవకాశం రావడంపై సూర్య సంతోషం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ ద్వారా సూర్య తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

మోహన్ బాబు సార్ తో పనిచేయడం గొప్ప అనుభూతి. ఆయన క్రమశిక్షణ కలిగిన లెజెండ్. 500 చిత్రాలకుపైగా నటించిన మోహన్ బాబు సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నేను నటిస్తోన్న సురారై పొట్టార్ చిత్రంలో భాగమైనందుకు ధన్యవాదాలు సర్ అని సూర్య ట్వీట్ చేశాడు.

దీనికి మోహన్ బాబు స్పందిస్తూ..సూర్య నా గురించి మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు. నేటి తరంలో గొప్ప స్టార్ అయి ఉండి..సెట్స్ లో నువ్వు చూపించే నిబద్దతే నీ మంచి స్వభావాన్ని చెబుతోంది. తర్వాత షూటింగ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నా డియర్ ఫ్రెండ్ అని రీట్వీట్ చేశాడు.
2936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles