దూసుకుపోతున్న మిషన్ మంగళ్

Sat,August 24, 2019 03:46 PM
successfully and record breaking movie mission mangal

ముంబై: గత గురువారం, స్వాతంత్య్ర దినోత్సవం రోజు విడుదలైన అక్షయ్ కుమార్ మూవీ మిషన్ మంగళ్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన నుంచి ఊహించని కలెక్షన్‌లతో దుమ్మురేపుతోంది. ఈ సినిమా తొమ్మిది రోజులకు గానూ రూ.135.99కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మొదటి వారంతో పాటు రెండో వారంలోనూ ద్విగ్విజయంగా కలెక్షన్లను రాబడుతోంది. శ్రీకృష్ణాష్టమితో పాటు వీకెండ్ కావడంతో 150కోట్లను సులువుగా దాటేస్తుందని ఆయన అన్నారు.
ప్రస్తుతానికి అక్షయ్ కుమార్ సినిమాల్లో మొదటి తొమ్మిది రోజులకు గాను 2.0, కేసరి తొలి రెండు స్థానాల్లో ఉండగా, కేసరి రికార్డు బద్దలవడానికి మరెంతో దూరం లేదని ఈ సందర్భంగా తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కాగా, ఈ సినిమాలో అక్షయ్‌తో పాటు విద్యాబాలన్, తాప్సీ, సోనాక్షిసిన్హ, కృతిసనన్, నిత్యామీనన్, కృతి కుల్హరి, శర్మన్ జ్యోషి నటించారు.

2034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles