కొత్త కాన్సెప్ట్‌తో వ‌స్తున్న సుమంత్‌.. టీజ‌ర్ విడుద‌ల‌

Sat,October 20, 2018 08:42 AM

Subrahmanyapuram TEASER RELEASED

సుమంత్ త‌న 25వ చిత్రంగా సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈషా రెబ్బ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా వాస్త‌విక మేళ‌వింపుల‌తో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా సాగుతుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు న‌టిస్తున్నారు. భక్తుల్ని అనుగ్రహించి వారి కోరికలు తీర్చాల్సిన దేవుడే ఆగ్రహించడానికి కారణమేమిటి? దేవుడిపై నమ్మకంలేని ఓ నాస్తికుడు దైవసంకల్పంతో తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే విష‌యాల‌పై క్లారిటీ ఈ సినిమా చూస్తే వ‌స్తుంద‌ని నిర్మాత‌లు అంటున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సుమంత్ నాస్తికుడిగా, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే నెల‌లో విడుద‌ల కానుండ‌గా, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలే పెంచింది. మీరు ఈ టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

1269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles