దేవుడిపైనే రీసెర్చ్ చేస్తున్న సుమంత్ - ట్రైల‌ర్

Thu,November 22, 2018 08:38 AM
Subrahmanyapuram Official Trailer released

సుమంత్ హీరోగా సంతోష్ జాగర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం సుబ్ర‌హ్మణ్య‌పురం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈషా రెబ్బ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా వాస్త‌విక మేళ‌వింపుల‌తో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా సాగుతుంది. ‘దేవుడి మహిమా.. మానవ మేథస్సా’ అంటూ ఆ దేవుడిపైనే రీసెర్చ్ చేస్తున్నాడు అక్కినేని హీరో సుమంత్. ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులోని అంశాలు ప్రేక్ష‌కులకి థ్రిల్ క‌లిగించేలా ఉన్నాయి. దేవుడంటే నమ్మకం లేని హీరో.. ‘సుబ్రహ్మణ్యపురం’ అనే ఊరికోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అసలు దేవుడిని ఎందుకు ఎదిరించాడు? దేవుడి ముసుగులో ఉన్న దుష్టశక్తులు ఏంటి? అనే అంశాల‌తో ఈ సినిమా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. హారర్, థ్రిల్లర్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్‌చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మరోసారి సారి మార్క్ చూపించారు. ఆర్.కె.ప్రతాప్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు మేక‌ర్స్.

2085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles