బాహుబ‌లి న‌టుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కేటీఆర్

Sat,August 4, 2018 12:55 PM
subbaraju gives a cheque to ktr

బాహుబ‌లి2 చిత్రంలో కుమార వ‌ర్మ పాత్ర పోషించి అందరిని అల‌రించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు . సినిమా మొద‌ట్లో అమాయకంగా క‌నిపించి చివ‌రిలో ధైర్యంగా పోరాడ‌డం అక్క‌డి ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో జ‌ప‌నీస్ ప్రేక్ష‌కులు కూడా ఇటీవ‌ల ఆయ‌న‌ని స్పెష‌ల్ స్క్రీనింగ్ కోసం ఆహ్వానం ప‌లికారు. ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టి గౌర‌వం ఈయ‌నకే ద‌క్కింది. విల‌న్‌గా కూడా అనేక పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించారు సుబ్బ‌రాజు. అయితే రీల్ లైఫ్‌లో విల‌న్‌గా మెప్పించిన సుబ్బ‌రాజు రియ‌ల్ లైఫ్‌లో సీఎంఆర్ ఎఫ్‌కి చెక్కుని అందించి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు.

ఇటీవ‌ల టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌కి వ‌చ్చిన మొద‌టి ఫిలిం ఫేర్ అవార్డుని వేలం వేసి ఆ వ‌చ్చిన డ‌బ్బుని సీఎంఆర్ ఎఫ్‌కి విరాళంగా ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సుబ్బ‌రాజు కూడా త‌న‌కి తోచినంత సాయం చేశాడు. ఓ ఫంక్ష‌న్‌లో కేటీఆర్‌ని క‌లిసి చెక్కును అందించాడు సుబ్బ‌రాజు. ఈ విష‌యాన్ని కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. గత రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కి వెళ్ల‌గా, సుబ్బ‌రాజు నా ద‌గ్గ‌ర‌కి న‌డుచుకుంటూ వ‌చ్చి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు. అంతేకాదు ఆయ‌న సీఎం రిలీఫ్ ఫండ్‌గా చెక్కుని అందించారు. మీ సాయానికి కృత‌జ్ఞ‌త‌లు బ్ర‌ద‌ర్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్‌.


4834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles