సైరాలో భాగం కానున్న స్టైలిష్ స్టార్

Tue,November 20, 2018 11:47 AM
Stylish Star To Be A Part Of Sye Raa

మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, త‌మన్నా ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఇక ఈ చిత్రంలో బ‌న్నీ కూడా భాగం కానున్నాడ‌ని తాజా స‌మాచారం. సురేంద‌ర్ రెడ్డి, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రేసు గుర్రం చిత్రం వీరిద్ద‌రికి మంచి విజ‌యాన్ని అందించ‌గా, అప్ప‌టి నుండి వీరి మ‌ధ్య మంచి రాపో ఉంది. ఈ క్ర‌మంలోనే సైరా సినిమా కోసం బన్నీని వాయిస్ అందించాల్సిందిగా కోరాడ‌ట ద‌ర్శ‌కుడు. ఈ విష‌యాన్ని చిరుతో ప్ర‌స్తావించ‌గా ఆయ‌న కూడా ఓకే చెప్ప‌డంతో త్వ‌ర‌లోనే బ‌న్నీతో వాయిస్ ఓవ‌ర్ చెప్పించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. మరి ఈ వార్త‌లో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బ‌న్నీ త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

2514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles