అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్ పెళ్ళిలో బ‌న్నీ సంద‌డి

Sat,May 25, 2019 08:25 AM
Stylish Star alluarjun attended asst choreographer  marriage

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లో అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్న శిరీష్ వివాహ వేడుక‌లో సంద‌డి చేశారు. ఆయ‌న రాక‌తో ఆ ప్రాంగ‌ణం సంద‌డిగా మారింది. బ‌న్నీని చూసేందుకు ఆయ‌న అభిమానులు ఎగ‌బ‌డ్డారు. నూత‌న వ‌ధూ వ‌రులు బ‌న్నీ పాదాలకి న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం పొందారు. నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాల‌ని బ‌న్నీ వారిని దీవించారు. శిరీష్‌కి బ‌న్నీకి మంచి సాన్నిహిత్యం ఉన్న క్ర‌మంలోనే ఆయ‌న శిరీష్ పెళ్ళికి హాజ‌ర‌య్యాడు. సినిమాల‌పై ప్రేమ‌తో హైద‌రాబాద్‌కి వ‌చ్చిన శిరీష్ మొద‌ట్లో గీతా ఆర్ట్స్‌లో అసిస్టెంట్ బాయ్‌గా చేరాడు. డ్యాన్స్‌పై అత‌నికి ఉన్న ఆస‌క్తిని గ‌మ‌నించిన బ‌న్నీ త‌గు శిక్ష‌ణ ఇప్పించార‌ట‌.

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా న‌టిస్తున్నఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడవ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించ‌నున్నారు. యువ హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సత్యరాజ్, సునీల్, రాజేంద్రప్రసాద్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


2173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles