'అదుగో' నుండి ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

Fri,September 21, 2018 01:31 PM
Stupid Stupid Boyfriend Full Song Lyrical from adhugo

క్రియేటివ్ డైరెక్ట‌ర్ ర‌విబాబు కాస్త డిఫరెంట్ గా ఆలోచించి పంది పిల్లపై అదుగో అనే సినిమా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో ఈ సినిమా విడుద‌ల కానుంద‌ని అభిమానులు భావిస్తుండ‌గా, ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ అభిమానుల‌లో చిత్రంపై ఆస‌క్తిని క‌లిగించింది. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌తో రూపొందుతున్న ఈ సినిమాని రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నిర్మాత సురేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప్ర‌శాంంత్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు, సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సినిమాకి సంబంధించిన తొలి సాంగ్‌ని తాజాగా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్ . స్టూపిడ్ స్టూపిడ్ అంటూ సాగే ఈ పాట‌కి భాస్క‌ర‌బ‌ట్ల లిరిక్స్ అందించ‌గా, రిద్ది పాట పాడారు. ఈ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి.

1351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles