స్ట‌న్నింగ్‌గా ఉన్న 'సూప‌ర్ డీల‌క్స్' ట్రైల‌ర్

Sat,February 23, 2019 07:46 AM
stunning trailer of Super Deluxe

త‌మిళంలో ‘మక్కల్ సెల్వన్’గా పిల‌వ‌బ‌డే విజ‌య్ సేతుప‌తి చేస్తున్న ప్ర‌యోగాత్మ‌క చిత్రం సూప‌ర్ డీల‌క్స్‌. ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా విజ‌య్ సేతుప‌తి క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఈ పాత్ర పేరు శిల్ప కాగా, ఎక్కువ మేకప్ లేకుండా లేడీ గెటప్ లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఫహద్‌ ఫాజిల్‌, సమంత, మిష్కిన్‌, రమ్యకృష్ణ, గాయత్రి, భగవతి పెరుమాల్‌ వంటి పెద్ద తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు కుమారరాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నలన్‌ కుమారస్వామి, మిష్కిన్‌, నీలన్‌ శేఖర్‌లు కుమార‌రాజాతో క‌లిసి స్క్రీన్ ప్లే రాశారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. బీఎస్‌ వినోద్‌, నీరవ్‌షాలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెల 29న విడుద‌ల కానున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ని తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు అభిమానుల‌ని ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా చిత్రంలో ‘లీల’ అనే శృంగార తార పాత్రలో రమ్యకృష్ణ కనిపించి సంద‌డి చేయ‌నుండ‌డం విశేషం.

975
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles