అంబ‌రాన్నంటేలా సంబ‌రాలు జ‌రుపుకున్న త‌ల ఫ్యాన్స్

Sat,March 2, 2019 10:54 AM
stunning  Celebrations From Thala Fans

త‌మిళ స్టార్ హీరోల‌లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నన‌టుడు త‌ల అజిత్ ఒక‌రు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం విశ్వాసం. శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్ర త‌మిళ వ‌ర్షెన్ జ‌న‌వ‌రి 10న విడుద‌లైంది. నిన్న‌టితో ఈ చిత్రం విడుద‌లై 50 రోజులు పూర్తి కావ‌డంతో అభిమానులు అర్ధ‌శ‌త‌క దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. థియేట‌ర్ల ముందు బాంబులు పేలుస్తూ, అజిత్ క‌టౌట్స్‌కి పాలాభిషేకం చేశారు. థియేట‌ర్‌ లోప‌ల్ తెర ముందు డ్యాన్స్‌లు కూడా చేశారు. అంబ‌ర‌న్నాంటేలా ఈ సంబ‌రాలు జ‌ర‌గ‌గా వీటికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. స‌త్య‌జోతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం అజిత్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టింది. నిన్న విశ్వాసం తెలుగు డ‌బ్బింగ్ వ‌ర్షెన్ విడుద‌ల కాగా, ఇక్క‌డ కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. చిత్రంలో న‌య‌న‌తార క‌థ‌నాయిక‌గా న‌టించ‌గా, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.1752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles