స్త్రీ.. వీకెండ్ వ‌సూళ్లు రూ.32.07 కోట్లు

Tue,September 4, 2018 10:21 AM
Stree film earns Rs 32.07 crore in opening weekend

ముంబై : రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధాకపూర్ జంటగా నటించి 'స్త్రీ' ఫిల్మ్.. బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే ఆ సినిమా సుమారు రూ.32.07 కోట్లు వసూల్ చేసింది. హారర్ కామిడీగా తెరకెక్కిన 'స్త్రీ'.. విడుదలైన మొదటి రోజే సుమారు ఏడు కోట్లు వసూల్ చేసింది. ఆ తర్వాత శని, ఆదివారాల్లో ఈ సినిమాకు ఇంకా మంచి వసూళ్లు వచ్చాయి. 'ఓ స్త్రీ రేపు రా' అని ప్రతి ఇంటి ముందు రాసి ఉంటుంది. రాత్రి పూట ఓ ఆడ దయ్యం వచ్చి యువ‌కుల‌ను ఎత్తుకెళ్లుతుందన్న భయం ఆ ఊళ్లో ఉంటోంది. 1980 దశకంలో ఇలాంటి సందర్భాలు కొన్ని రాష్ర్టాల్లో ఎదురయ్యేయి. అయితే ఆ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అమర్ కౌషిక్ ఈ సినిమాను డైరక్ట్ చేశాడు.

2857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles