కోడి రామ‌కృష్ణ త‌ల బ్యాండ్ వెనుక ఉన్న క‌హానీ ఇదీ..!

Fri,February 22, 2019 04:58 PM
story behind the head band

కోడి రామ‌కృష్ణ‌.. ఈ పేరు వింటే ముందుగా అంద‌రికి ఆయ‌న రూపం గుర్తుకు వ‌స్తుంది. ఎప్పుడు తెల్ల బ‌ట్ట‌ల‌లో ఉండే ఆయ‌న త‌ల‌కి బ్యాండ్‌తో క‌నిపిస్తారు. పెద్ద‌గా ప‌రిచ‌యం లేని వారు కూడా ఆయ‌న త‌ల బ్యాండ్‌ని బ‌ట్టి కోడి రామ‌కృష్ణ అని చెప్పేస్తుంటారు. ఇప్ప‌టి ద‌ర్శ‌కులు కొంద‌రు కోడి రామ‌కృష్ణ ట్రెండ్‌ని ఫాలో అవుతుంటారు. అయితే ఆ బ్యాండ్ వెనుక ఉన్న అస‌లు స్టోరీ ఏమంటే..దాస‌రి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కొన్నాళ్లు ప‌ని చేసిన కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌కుడిగా ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య చేశారు. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. దీంతో రెండో చిత్రానికి పెద్ద‌గా గ్యాప్ తీసుకోలేదు.

కోవ‌లం బీచ్ ద‌గ్గ‌ర త‌న రెండో సినిమా చిత్ర షూటింగ్ జ‌రుపుతున్నారు కోడి రామ‌కృష్ణ‌. ఆ స‌మ‌యంలో అక్క‌డికి ఎన్టీ రామారావు కాస్ట్యూమర్‌ మోకా రామారావు వ‌చ్చార‌ట‌. మిట్ట మ‌ధ్యాహ్నం మండుటెండ‌లో సినిమా చేస్తున్న కోడిని చూసిన ఆయ‌న మీ నుదురు ఎండ‌కి కాలిపోతుంది అని త‌న‌ జేబులో ఉన్న రుమాలు ఇచ్చి క‌ట్టుకోమ‌న్నార‌ట‌.ఆ రోజంతా ఆ రుమాలుని నుదుట‌పై అలానే ఉంచుకున్న కోడి రామ‌కృష్ణ త‌ర్వాతి రోజున బ్యాండ్‌లా త‌యారు చేసి క‌ట్టుకున్నార‌ట‌. ఇది మీకు బాగా సూట్ అయింది. దీనిని క‌ట్టుకోకుండా ఉండొద్దు అని మోకా రామారావు చెప్పార‌ట‌. ఇక అప్ప‌టి నుండి ఆయ‌న‌కి ఈ త‌ల బ్యాండ్ సెంటిమెంట్‌గాను మారింది. దీంతో ఆయ‌న‌కి ప్ర‌త్యేక గుర్తింపు కూడా వ‌చ్చింది. పోలీసులకు టోపి, రైతుకు తలపాగా ఎలాగో నాకు ఈ బ్యాండ్‌ అలా అన్నమాట. దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాను అని ప‌లుమార్లు కోడి రామ‌కృష్ణ ఇంట‌ర్వ్యూల‌లో తెలిపారు.

4613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles