ఎన్టీఆర్ న్యూ లుక్ కోసం రాజ‌మౌళితో చర్చ‌లు

Tue,October 23, 2018 08:17 AM
Steven Lloyd meets with rajamouli

జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం తెరకెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ లోపు ఇద్ద‌రు హీరోలు త‌మ మేకోవ‌ర్ పూర్తిగా మార్చుకోవ‌ల‌సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ కోసం సిద్ద‌మ‌వుతుండ‌గా, చెర్రీ .. బోయపాటి సినిమా పూర్తైన త‌ర్వాత రాజ‌మౌళి సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేయ‌నున్నాడు. అయితే ప్ర‌ముఖ హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్ .. ఎన్టీఆర్‌ని స‌రికొత్త లుక్‌లో చూపించేందుకు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో క‌లిసి సంప్ర‌దింపులు జ‌రిపాడ‌ట‌. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపిన లాయిడ్ .. రాజ‌మౌళితో క‌లిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేశాడు. 2020లో విడుద‌ల కానున్న రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించ‌నున్నారు. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నున్నాడు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు.2132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS