ఎన్టీఆర్ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన ట్రైన‌ర్‌

Wed,December 5, 2018 12:56 PM
Steven Lloyd gives clarity on ntr look

జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం తెరకెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. మ‌ల్టీ స్టార‌ర్ కోసం ఇద్ద‌రు హీరోలు త‌మ మేకోవ‌ర్‌ని పూర్తిగా మార్చుకుంటున్నార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ లుక్ ఇదే అంటూ జోరుగా ప్ర‌చారం చేశారు. దీనిపై ఎన్టీఆర్ జిమ్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

పుకార్లు న‌మ్మ‌కండి. ఎన్టీఆర్ లుక్ గురించి వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. ఆ ఫోటోలు గ‌త ఏడాదికి సంబంధించిన‌ది. ఆయ‌న లుక్ అది కాదు అని లాయిడ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్లో జ‌రుగుతుంది. జ‌క్కన్న ఈ ఇద్ద‌రు హీరోల‌పై యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మేజిక్ డేట్ (12-12-12)న చిత్రానికి సంబంధించి భారీ ఎనౌన్స్‌మెంట్ వస్తుంద‌ని అంటున్నారు. కీర్తి సురేష్ ,ర‌ష్మిక క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి లేడి విల‌న్‌గా క‌నిపించ‌నుంద‌ట‌. 2020లో విడుద‌ల కానున్న రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించ‌నున్నారు. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నున్నాడు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. డీవీవీ దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


3061
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles