ఎన్టీఆర్ ఫేక్ పిక్చ‌ర్స్‌పై ట్రైన‌ర్ క్లారిటీ

Fri,March 23, 2018 10:51 AM
Steven Lloyd gives clarity on fake pics

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా జై ల‌వ‌కుశ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, త‌దుప‌రి చిత్రంగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఈ సినిమా కోసం అమెరికా జిమ్‌ ట్రైనర్‌ స్టీవెన్స్ లాయిడ్ స‌మ‌క్షంలో త‌న మేకొవ‌ర్ పూర్తిగా మార్చుకుంటున్నాడు ఎన్టీఆర్. కొద్ది రోజులుగా ఎన్టీఆర్ న్యూ లుక్‌కి సంబంధించి పలు ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక తాజాగా జిమ్‌లో ఎన్టీఆర్ చేస్తున్న వ‌ర్కవుట్ ఫోటో అంటూ ఓ పిక్ సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొట్టింది. దీనిపై జిమ్ ట్రైన‌ర్ క్లారిటీ ఇచ్చాడు. ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి ఎన్టీఆర్ కాదు. ఎవ‌రో వ్య‌క్తి ఇలా క్రియేట్ చేశాడు. ఆయ‌న క్రియేటివిటీకి హ్య‌ట్సాఫ్ అని అన్నారు. అయితే మరి ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి ఎవ‌రా అని అభిమానులు ఆరా తీయ‌గా, ఆయ‌న హీరో ప్రిన్స్ అని తేలింది. ప్రిన్స్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ వ‌ర్క‌వుట్ వీడియోని షేర్ చేయ‌గా, అందులో బ్యాక్ నుండి స్క్రీన్ షాట్ తీసి అది ఎన్టీఆర్ అంటూ ప్ర‌చారం చేశారు. మొత్తానికి ఈ ఫోటోపై అభిమానుల‌కి ఓ క్లారిటీ వ‌చ్చింది. ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం ఏప్రిల్ 12న సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. భారీ బ‌డ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొంద‌నున్న ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొంద‌నుంది.


2027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles