స్టార్ మ‌హిళ కార్య‌క్ర‌మానికి పులిస్టాప్ పెట్టిన సుమ‌

Fri,August 17, 2018 11:13 AM
star mahila gets end for this season

బుల్లితెర‌పై త‌న మాట‌ల గార‌డీతో ఎంద‌రో మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న టీవి యాంక‌ర్ సుమ క‌న‌కాల‌. మ‌ల‌యాళీ అయిన‌ప్ప‌టికి తెలుగు ఉచ్చార‌ణలో తన‌కి త‌నే సాటి అని నిరూపించుకుంది సుమ‌. 12 ఏళ్ళుగా స్టార్ మ‌హిళ అనే కార్య‌క్ర‌మాన్ని ఒంటి చేత్తో ముందుకు న‌డిపించిన ఘ‌న‌త సుమ‌కే చెల్లింది. ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కి ప్ర‌సార‌మ‌య్యే ఈ షోకి పిల్లలు, పెద్ద‌లు, మ‌హిళలు అభిమానులుగా ఉన్నారు. మూడు వేల‌కి పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ కార్య‌క్ర‌మంకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమకు ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు కూడా దక్కింది.

ఏక‌ధాటిగా 12 ఏళ్ళు స‌క్సెస్ ఫుల్‌గా సాగిన ఈ కార్యక్ర‌మంకి పులిస్టాప్ పెడుతున్న‌ట్టు త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిజయ‌జేసింది సుమ. ఈ కార్య‌క్ర‌మాన్ని ఇన్నాళ్లుగా ఆద‌రించినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపింది. ప్రపంచంలో ఏది శాశ్వ‌తం కాదు. ఇందులో భాగంగా స్టార్ మ‌హిళ కార్య‌క్ర‌మం ప్ర‌యాణం కూడా ముగిసింది. వినూత్న కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌నే ఉద్దేశంతో స్టార్ మ‌హిళ‌కి ముగింపు ప‌లికాం. ఈ కార్య‌క్ర‌మాన్ని మీరు ఎంత మిస్ అవుతార‌నేది మేం అర్ధం చేసుకుంటా. మీరు నాకు, స్టార్‌ మహిళకు వీరాభిమానులైతే, నేనంటే మీకు అభిమానముంటే ఓ చిన్న సెల్ఫీ వీడియో తీసి పంపండి. ఇందులో నేను కాని స్టార్ మ‌హిళ‌కాని ఎంత ఇష్ట‌మో తెలపాల‌న్నారు. బెస్ట్ వీడియోల‌ని ఫినాలే ఎపిసోడ్‌లో ప్ర‌సారం చేయ‌నున్న‌ట్టు సుమ తెలిపింది. మీరు చూపించిన‌ ప్రేమను, స్టార్‌ మహిళ ప్రోగ్రామ్‌ను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను’’ అని సుమ ఈ వీడియోలో తెలిపారు.

9068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles