వ‌రంగ‌ల్ అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి

Thu,August 1, 2019 12:02 PM

శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ఫిదా చిత్రంలో తెలంగాణ అమ్మాయి పాత్ర‌లో న‌టించి అంద‌రిని ఫిదా చేసింది సాయిప‌ల్ల‌వి. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వేణు ఉడుగ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విరాట ప‌ర్వం అనే చిత్రం చేస్తుంది. రానా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, సాయి ప‌ల్ల‌వి టీంతో ఇటీవ‌ల క‌లిసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం సాయి ప‌ల్లవి విరాట ప‌ర్వం చిత్రంలో వ‌రంగ‌ల్ అమ్మాయిగా క‌నిపించి సంద‌డి చేయ‌నుంద‌ట‌. న‌క్స‌లిజం నేప‌థ్యంలో పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ఈ చిత్రం ఉండ‌నుంద‌ని అంటున్నారు. ఫోక్ సింగ‌ర్‌గా సాయి ప‌ల్ల‌వి ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం రానాకి కిడ్నీ ట్రీట్‌మెంట్ జ‌రుగుతుండ‌గా, అది పూర్తైన త‌ర్వాత అక్టోబ‌ర్‌లో సాయి పల్ల‌వి, రానా మ‌ధ్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలానే ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట‌.

3076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles