అఫీషియ‌ల్‌..త‌లైవా సినిమాలో సిమ్రాన్‌, సిద్ధిఖీ

Thu,July 19, 2018 09:43 AM
star actors plys key role in rajanikanth new movie

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో త‌న 165వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందుతుంది. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. గ్యాంగ్ స్ట‌ర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీ క్యాస్టింగ్‌ని ఎంపిక చేస్తుంది చిత్ర యూనిట్‌. అల‌నాటి అందాల భామ సిమ్రాన్ ఈ మూవీలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై చిత్ర యూనిట్ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసింది. సిమ్రాన్‌తో పాటు బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఈ మూవీలో న‌టిస్తున్న‌ట్టు పేర్కొంది.

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా చ‌ల‌మాణీ అయిన సిమ్రాన్ టాప్ స్టార్స్ అంద‌రి స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వంటి స్టార్స్‌తో న‌టించిన సిమ్రాన్ తన అందచందాలతో పాటు వైవిధ్యమైన నటనతో కుర్ర కారు గుండెల్లో రైళ్ళు పరుగులెత్తించింది. ఈ మ‌ధ్యే త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కి రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ డైరెక్టర్ పొణరామ్ ద‌ర్శ‌క‌త్వంలో శివకార్తికేయన్, సమంత ప్రధాన పాత్రలలో రూపొందుతున్న‌ సినిమాలో సిమ్రాన్ న‌టించింది. ఇందులో విల‌న్‌గా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అయితే ఇప్పుడు ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న నటించే గొప్ప ఛాన్స్ ఈ అమ్మ‌డికి ద‌క్కడంతో చాలా హ్యాపీగా ఉంది సిమ్రాన్. మ‌రో వైపు బాల్ థాక‌రే బ‌యోపిక్‌లో న‌టిస్తున్న న‌వాజుద్దీన్.. ర‌జనీకాంత్ 168వ సినిమాలో న‌టించ‌డం విశేషం.

1034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles