రాజ‌మౌళి ఇంట్లో శుభ‌కార్యం

Thu,September 6, 2018 09:41 AM
ss karthikeya engagement with pooja

ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి ఫ్యామిలీ అంతా బాహుబ‌లి చిత్రం కోసం ఎంత‌గా శ్ర‌మించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిద్రాహారాలు మానేసి మ‌రీ క‌ష్ట‌ప‌డ్డారు. ఐదేళ్ళ‌పాటు శ్ర‌మించిన వారికి ఈ చిత్రం మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది. బాహుబ‌లి చిత్రం త‌ర్వాత రాజ‌మౌళి మ‌రో భారీ ప్రాజెక్ట్‌ని చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. రామ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అయితే ఈ లోపు ఫ్యామిలీ అంతా టైంని స‌ర‌దాగా స్పెంట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాజ‌మౌళి ఇంట శుభ‌కార్యం జ‌రిగింది. రాజ‌మౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ నిశ్చితార్ధం జ‌గ‌ప‌తి బాబు సోద‌రుడు రాం ప్ర‌సాద్ కుమార్త్ పూజా ప్ర‌సాద్‌తో జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రిగిన నిశ్చితార్ధంలో ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా సంద‌డి చేశారు. పూజా ప్ర‌సాద్ భ‌క్తి గీతాల‌ని ఆల‌పించే గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ బాహుబలి చిత్రానికి దర్శకత్వం విభాగంలో పనిచేశారు. ఆయన బాహుబలి సెకండ్ యూనిట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. త్వ‌ర‌లో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కొన్నాళ్ళ నుండి కార్తికేయ‌, పూజాలు ప్రేమ‌లో ఉండ‌గా, పెద్ద‌ల అంగీకారంతో వీరిరివురు పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే పెళ్లితేదిని ప్ర‌క‌టించ‌నున్నారని టాక్.

8009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles