కమల్ తో కనిపించిన శృతి బాయ్ ఫ్రెండ్

Wed,December 6, 2017 05:24 PM
sruti boy friend with kamal

కమల్ గారాల పట్టీ శృతి హాసన్ ఇటీవల తన ప్రియుడు మైఖేల్ కోర్సెల్ ని తల్లి సారికకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిందరు కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్లి సరదాగా కాసేపు టైం గడిపారు కూడా. ఈ క్రమంలో త్వరలోనే శృతి పెళ్ళి జరగడం ఖాయమని బాలీవుడ్ మీడియా జోస్యాలు చెప్పింది. కట్ చేస్తే రీసెంట్ గా శృతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ పెళ్ళిలో మెరిసింది. వారితో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఉండడంతో మళ్ళీ శృతి పెళ్లికి సంబంధించి పుకార్లు గుప్పుమంటున్నాయి.

తమిళ నటుడు ఆదవ, వినోదినిల వివాహం మంగళవారం చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. రాధిక, మురుగదాస్ లతో పాటు కమల్ , శృతిహాసన్, మైఖేల్ కోర్సేల్ కూడా హాజరయ్యారు. అయితే పెళ్ళిలో కమల్, శృతి, మైఖేల్ ముగ్గురు పక్క పక్కన కూర్చొని ముచ్చట్లాడడం కనిపించారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో అభిమానులలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. మరో ముఖ్య విశేషమేమంటే కమల్ తో పాటు మేఖేల్ కూడా పంచెకట్టులో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. మరి మైఖేల్ తో రిలేషన్ పై శృతి ఎప్పుడు నోరు విప్పుతుందో చూడాలి.


2160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles