మీటూ ఎఫెక్ట్: అర్జున్‌పై న‌టి ఆరోప‌ణ‌లు

Sun,October 21, 2018 07:19 AM
sruthi  sexual comments on arjun

మీటూ జ్వాల‌లు దేశంలో ఇంకా ర‌గులుతూనే ఉంది. స‌మాజంలో పెద్ద‌లుగా చ‌లామ‌ణీ అవుతున్న కొంద‌రి చీక‌టి కోణాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా యాక్ష‌న్ కింగ్ అర్జున్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌నం రేపుతుంది. న‌టి శృతి హ‌రిహ‌ర‌ణ్ త‌న ఫేస్ బుక్ పేజ్‌లో అర్జున్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, మీటూ ఉద్య‌మం వ‌ల‌న త‌న అనుభ‌వాల‌ని బ‌య‌ట‌పెట్టుకునే అవ‌కాశం ద‌క్కినందుకు సంతోషిస్తున్నాన‌ని తెలిపింది.

మీటూ ఉద్య‌మం వ‌ల‌న ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎదురైన కొన్ని చెడు సంఘ‌ట‌న‌లు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. తాజాగా శృతి హ‌రిహ‌ర‌ణ్ త‌ను ఫేస్ చేసిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌ని వివ‌రించింది. ఎన్నో క‌ల‌ల‌తో సినిమా కెరీర్ స్టార్ట్ చేశాను. చిన్న‌ప్ప‌టి నుండి అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగాను. 2016లో ఆయ‌న‌తో క‌లిసి నిబునన్ (తెలుగులో కురుక్షేత్రం) సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. చాలా సంతోషించా. అయితే ఓరొమాంటిక్ సీన్‌లో అత‌ను నన్ను కౌగిలించుకొని త‌డుముతుండ‌డం నాకు అస్స‌లు నచ్చ‌లేదు. కొన్ని భ‌యంక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు కూడా నా దృష్టికి రాగా, వాటిని నుండి తెలివిగా త‌ప్పించుకోగ‌లిగాను

ఆర్టిస్టులు ఎవరైనా తమ హద్దులు దాటకూడదు. ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. వ్యక్తిగతంలో ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను బటయపెట్టేందుకు మీటూ ఉద్యమం నాకు తోడ్పడింది. మహిళలందరం కలిసికట్టుగా ఉద్యమిస్తే మనం మరింత శక్తివంతంగా మారతాం. బాధిత మహిళలు గళమెత్తాల్సిన సమయం వచ్చేసిందంటూ’ శ్రుతి హరిహరణ్ పోస్ట్ లో తెలిపారు. అయితే దీనిపై స్పందించిన అర్జున్ త‌న‌పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌లు ఖండించారు. 150 సినిమాల‌లో ఎంతో మంది హీరోయిన్స్‌తో క‌లిసి న‌టించా. అంద‌రితో స్నేహంగానే మెలిగాను. ఎప్పుడు ఇలాంటి ఆరోప‌ణ‌లు రాలేదు. కాని శృతి నాపై ఎందుకు ఆరోప‌ణ‌లు చేస్తుందో అర్దం కావ‌డం లేదు. త‌న‌పై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాను అని అన్నారు.

2397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles