అర్ధరాత్రుల్లో షూటింగ్ చేస్తోన్న శృతి

Wed,November 16, 2016 12:21 PM
sruthi posts Burning the midnight oi

అందాల భామ శృతి హాసన్ తాజాగా పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ కాటమరాయుడు చిత్రంలో కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలలో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ చిత్రంకు సంబంధించిన కీలక సన్నివేశాలను రాత్రి వేళలలో తెరకెక్కిస్తున్నారట. దీనిపై శృతి ఓ ఫోటో పోస్ట్ చేస్తూ వెరైటీ కామెంట్ పెట్టింది. యాష్ ట్యాగ్ తో వర్క్ మోడ్, గ్రేయార్డ్ షిఫ్ట్, మేకింగ్ మూవీస్, హ్యపీ టూ బీ అనే కామెంట్ పెట్టింది. అంటే దెయ్యాలు తిరిగే టైంలో షూట్ చేస్తున్నామని, ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని తెలిపింది శృతి. గబ్బర్ సింగ్ లో పవన్ తో కలిసి నటించగా, ఇప్పుడు కాటమరాయుడు చిత్రంలోను నటిస్తుండడం తనను ఆనందానికి గురి చేస్తోందని శృతి పేర్కొంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఉగాది శుభాకాంక్షలతో మార్చి 29, 2017న విడుదల కానున్నట్టు తెలుస్తోంది. శృతి నటించిన ప్రేమమ్ చిత్రం పెద్ద హిట్ కాగా త్వరలో సింగం 3తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

2546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles