బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన శృతి హాసన్..!

Fri,July 28, 2017 02:50 PM
sruthi hassan with his boy friend at mumbai airport

ఈ మధ్య కమల్ ఫ్యామిలీ ఏదో ఒక టాపిక్ తో వార్తలలో నానుతున్నారు. ఉలగనాయగన్ తమిళ నాడు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారితే, కమల్ చిన్న కూతురు అక్షర్ హాసన్ తాను మతం మార్చుకున్నాను అని తెలిపి మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇక రీసెంట్ గా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిందని ముంబై మిర్రర్ పత్రిక రిపోర్ట్ చేయడంతో ఇక అన్ని పత్రికలతో పాటు ఛానెల్స్ లోను శృతి వార్తలే హల్ చల్ చేస్తున్నాయి. శృతి బాయ్ ఫ్రెండ్ పేరు మైఖేల్ కొర్సలే అని తెలుస్తుండ‌గా, అతను ఇటాలియన్ . ప్రస్తుతం లండన్ లో ఉంటాడని తెలుస్తుంది. అయితే బుధవారం రాత్రి తాను ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగడంతో , ఆయనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన శృతి కారులోకి ఎక్కగానే గట్టిగా హగ్ చేసుకుందట. అక్కడ ఉన్న కెమెరాలు వెంటనే ఈ సన్నివేశాన్ని క్లిక్ మనిపించడంతో శృతి- మైఖేల్ కొర్సలే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం శృతి తన తండ్రి తెరకెక్కిస్తున్న శభాష్‌ నాయుడు చిత్రంతో ముంబైలో బిజీగా ఉంది.

7227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles