సంఘ‌మిత్ర నుండి త‌ప్పుకున్న శృతి హాస‌న్

Mon,May 29, 2017 04:41 PM
sruthi exit from SANGAMITHRA

బాహుబ‌లి2, 2.0 చిత్రాల‌కు పోటీగా సంఘ‌మిత్ర చిత్రం తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే. దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాల‌ని సుంద‌ర్ సి భావించాడు. ఆర్య‌, జ‌యం ర‌వి, శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్స్ రీసెంట్ గా కేన్స్ లో విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో శృతి యువరాణిగా నటించనుండగా, ఆ పాత్ర కోసం కొన్నాళ్ళ నుండి కసరత్తులు చేస్తుంది శృతి. ఆ క‌స‌ర‌త్తులకి సంబంధించిన వీడియోల‌ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం సంఘ‌మిత్ర చిత్రం నుండి శృతి త‌ప్పుకుంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ థెండాళ్ ఫిలింస్ ప్ర‌క‌టించింది. స‌రైన బౌండ్ స్క్రిప్ట్, ప‌ర్టిక్యుల‌ర్ డేట్స్ విష‌యంలో ఎక్క‌డ క్లారిటీ లేక‌పోవ‌డంతోనే తాను త‌ప్పుకున్న‌ట్టు శృతి తెలిపింద‌ట‌.. సంఘ‌మిత్ర చిత్రం వ‌చ్చే ఏడాది పట్టాల‌పైకి వెళ్ళ‌నుండ‌గా, ఈ మూవీకి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నాడు.





1985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles