శంక‌ర్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో విల‌న్‌గా షారూఖ్ ?

Tue,August 6, 2019 12:35 PM
SRK In Shankars Ambitious Underwater Project

టెక్ మాంత్రికుడు శంక‌ర్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల 2.0 అనే విజువ‌ల్ వండ‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శంక‌ర్ ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌తో భార‌తీయుడు 2 చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే, ఆయ‌న తదుప‌రి ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇండియ‌న్ 2 త‌ర్వాత బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి శంక‌ర్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో చిత్రం చేయ‌నున్నాడ‌ని చెప్పుకొచ్చారు. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం హృతిక్ రోష‌న్ స్థానంలో షారూఖ్ ఖాన్ వ‌చ్చి చేరిన‌ట్టు తెలుస్తుంది.

జీరో చిత్రం త‌ర్వాత మ‌రో సినిమాని ఓకే చేయ‌ని షారూఖ్‌.. శంకర్ తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషించ‌నున్నాడ‌ట‌. సూపర్ పవర్స్ కలిగి ఉన్న ఒక గొప్ప తెలివిగల ఆక్టోపస్ లాంటి జీవి అయిన చీఫ్ విరోధి పాత్ర పోషించడానికి షారూఖ్ సిద్దంగా ఉన్నాడ‌ట‌. ఇప్ప‌టికే శంక‌ర్.. షారూఖ్‌ని సంప్ర‌దించి పాత్ర గురించి చెప్ప‌డంతో ఆయ‌న ఈ ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ని చెబుతున్నారు. మ‌రి ఈ వార్త‌కి సంబంధించి పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles