ఆ రాత్రిని మరిచిపోలేను : రకుల్‌ప్రీత్‌సింగ్

Tue,October 13, 2015 05:42 PM
SRK Disturbs Rakul in Bruce Lee set


హైదరాబాద్: కరెంట్ తీగ సినిమాతో యువకుల గుండెల్లో కరెంట్ పాస్ చేసింది టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్. వరుస సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్న ఈ హీరోయిన్ తక్కువ సమయంలోనే అగ్రహీరోల సరసన చాన్స్ కొట్టేస్తూ టాప్ హీరోయిన్ల లిస్ట్‌లోకి చేరింది. ఈ భామకు ఓ రాత్రి అరుదైన ఎదురైన అనుభవంతో ఎంతో భావోద్వేగానికి లోనయ్యిందట. ఇంతకీ విషయమేంటో అనుకుంటున్నారా..రకుల్ చెబుతుంది బ్రూస్‌లీ సెట్ లో ఎదురైన అనుభవం గురించి.

రాంచరణ్ హీరోగా నటిస్తున్న బ్రూస్‌లీ సినిమాకు సంబంధించిన ఫైనల్ సాంగ్‌ను ఇటీవలే వేసిన ఓ సెట్‌లో షూట్ చేశారు. షూటింగ్ కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ లొకేషన్ కు వచ్చారు. లొకేషన్ లో గంటసేపు ఉండి సాంగ్ చిత్రీకరణను చూసిన షారుఖ్ తిరిగెళ్లేటపుడు రకుల్‌ప్రీత్‌సింగ్‌తో ఫర్‌ఫార్మెన్స్ బాగా చేశావని కితాబిచ్చారట. ఈ విషయమై రకుల్ మాట్లాడుతూ షూటింగ్‌లో పాల్గొంటున్నపుడు మన ముందు షారుఖ్‌ఖాన్ ఉంటే పనిపై ఎట్లా శ్రద్ధ పెడతాం. అందుకే ఆ రోజు రాత్రి పాట షూట్ చేసిన తర్వాత షారుఖ్ అందించిన ప్రశంసలను ఎప్పటికీ మరిచిపోలేనంటూ వాపోయింది.

3929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles