అంత‌రిక్షంలోకి వెళ్ళేందుకు సిద్ధ‌మ‌వుతున్న బాద్‌షా !

Wed,December 12, 2018 09:00 AM
SRK  Astronaut Rakesh Sharma Biopic Going Underway

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం జీరో ఈ నెల 21న విడుద‌ల కానుండ‌గా, ఈ చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇందులో షారూఖ్ మ‌రుగుజ్జుగా క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ చిత్రం త‌ర్వాత తొలి భారతీయ వ్యోమగామి అయిన రాకేశ్‌ శర్మ పాత్రలో రూపొందుతున్న బ‌యోపిక్‌లో షారూఖ్ న‌టించ‌నున్నాడట. 1984 ఏప్రియల్‌ 3న రష్యాకు చెందిన సోయజ్‌ టి- 11 ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాడు రాకేశ్‌ శర్మ. ఆయన చేసిన సాహసాన్ని భారతీయులకు కళ్ళకు గట్టినట్టు చూపించాలని షారూఖ్ తహతహలాడుతన్నాడట.వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుండి తన పాత్ర‌కి సంబంధించి ప్రిప‌రేష‌న్స్ చేసుకోనున్నాడ‌ట‌. మే లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి సెల్యూట్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. త‌న కెరీర్‌లో ఈ చిత్రం ఎప్ప‌టికి నిలిచి ఉండేలా షారూఖ్ క‌స‌రత్తులు చేసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. మ‌హేష్ మ‌హ‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని రొన్ని స్క్రూవాలా, సిద్ధార్ద్ రాయ్ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఈ చిత్రం తొలి బాలీవుడ్‌ స్పేస్ మూవీగా ఈ చిత్రం రికార్డులకెక్కడం ఖాయమని పలువురు సినీ పండితులు చెబుతున్నారు. ఆస్కార్ సైతం ఈ సినిమాను టార్గెట్‌ చేస్తుందని అంటున్నారు. అయితే గ‌తంలో ఈ సినిమాని ఆమీర్ చేయ‌నున్నాడ‌ని , అమీర్ ను ‘ఆస్ట్రోనాట్‌' గా మార్చి ఆ ఫోటోలను అభిమానులు సోషల్‌ సైట్స్ లో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles