శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో

Sun,May 21, 2017 12:53 PM
sriwass directed BellamKonda Srinivas

యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా త్వ‌ర‌లోనే రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ మూవీ రూపొంద‌నుండ‌గా, తాజాగా ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి బోయపాటి శ్రీనివాస్, లారెన్స్, వివి వినాయ‌క్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. బోయ‌పాటి శీను ఫ‌స్ట్ షాట్ డైరెక్ట్ చేయ‌గా, వివి వినాయ‌క్ క్లాప్ కొట్టారు. రాఘ‌వ లారెన్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనుండ‌గా, ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

1184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles