బిజినెస్ లోకి అడుగుపెట్టిన స్టార్ డైరెక్టర్ భార్య

Thu,February 22, 2018 04:34 PM
Srinu Vaitla Wife enter into new business

సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరో హీరోయిన్స్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బిజినెస్ లు చేస్తున్నారు. ఈ కోవలో రకుల్, కాజల్ వంటి అందాల భామలు ఉన్నారు. అయితే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ భార్య కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్ షా లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో టాప్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగిన శ్రీను వైట్ల భార్య .. వేదిక్ అనే బ్రాండ్ ద్వారా వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ బ్రాండ్ ద్వారా తొలుత ఆవు పాలని విక్రయించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు రూపా వైట్ల. ఎన్నో బ్రాండ్స్ మనకు అందుబాటులో ఉన్నప్పటికి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ చాలా ఉండటంతో ఈ రంగం వైపు మొగ్గుచూపారు రూపా. ''ఇది ఓ విధానం కాదు.. విప్లవం'' అంటూ వేదిక్ బ్రాండ్ తో మార్కెట్లో తొలి అడుగు వేస్తున్నారు రూపా వైట్ల. ఇక శ్రీనువైట్ల తన పూర్వ వైభవాన్ని అందుకునేందుకు దర్శకత్వ ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నాడు. త్వరలో రవితేజతో అమర్ అక్బర్ ఆంథోని అనే సినిమా చేయనుండగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

3288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles