శ్రీనివాస కళ్యాణం.. వినూత్న రీతిలో ప్రేక్షకులకు ఆహ్వానం

Thu,August 9, 2018 12:54 PM
srinivasa kalyanam movie release at kothapet

హైదరాబాద్ : నితిన్, రాశీఖన్నా నటీనటులుగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ఇవాళ విడుదలైంది. కొత్తపేటలోని మహాలక్ష్మి థియేటర్‌లో ఈ మూవీ విడుదల సందర్భంగా వినూత్న రీతిలో ప్రేక్షకులకు ఆహ్వానం పలికారు. సంప్రదాయబద్దంగా కుంకుమ బొట్టు పెట్టి, పువ్వులు ఇస్తూ, మహిళలకు పసుపు, గంధం రాస్తూ, డోలు సన్నాయి మేళంతో ప్రేక్షకులకు ఆహ్వానం పలికారు మూవీ సిబ్బంది. ప్రేక్షకులు కూడా ఈ అనుభూతిని ఆస్వాదిస్తూ సినిమా థియేటర్‌లోకి అడుగుపెట్టారు.

2084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles