బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎవరు వచ్చారో చూడండి బాస్..!

Thu,June 21, 2018 10:25 PM
srinivas reddy, vennela kishore are participating bigg boss telugu season 2

హైదరాబాద్: ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్2 టీవీ షోకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. రెండో సీజన్‌కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 10న అట్టహాసంగా రియాల్టీ షో ప్రారంభమైంది. హౌజ్‌లో ఉన్న సభ్యులకు బిగ్‌బాస్ ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. పదిరోజుల నుంచి పలు టాస్క్‌లు చేస్తూ, తమ మనసులోని మాటలను సహచరులతో పంచుకుంటూ, కొన్నిసార్లు తోటి సభ్యులతో వాగ్వివాదాలకు దిగుతూ షోను రసవత్తరంగా మార్చివేశారు.

గతేడాది సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా విడుదలకు సిద్ధమవుతున్న చిత్ర బృందాలను బిగ్‌బాస్ హౌజ్‌లోకి అనుమతించారు. గురువారం జరిగే బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ‘జంబలకిడిపంబ’ చిత్ర యూనిట్ ఈ షోలో కనువిందు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు బిగ్‌బాస్ సభ్యులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారని స్టార్‌మా ట్విటర్ ద్వారా నిర్వాహకులు వెల్లడించారు. ‘జంబలకిడిపంబ’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే.5082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles