క‌మెడీయ‌న్ పేరు వాడుకొని మోసం

Tue,September 18, 2018 10:05 AM
Srinivas Reddy complaints on ravi kiran

సోష‌ల్ మీడియాని మంచి పనుల కంటే చెడు పనుల కోసం ఉప‌యోగించే వారే ఎక్కువ అని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో కొంద‌రు న‌కిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించి అమాయ‌కుల‌కి గాలం వేసి మోసం చేస్తున్నారు. ర‌వికిర‌ణ్‌ అనే వ్య‌క్తి గ‌తంలో ఆర్టిస్ట్‌ల‌ కింద అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. ఆ ప‌రిచ‌యాల‌ని అడ్డుపెట్టుకున్న ఆ వ్యక్తి న‌కిలి ఫేస్ బుక్ ఐడీల‌ని క్రియేట్ చేసి సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాను, మంచి క‌థ‌లు ఉంటే పంపాల‌ని ప‌లువురితో చాటింగ్ చేశాడ‌ట‌.

క‌మెడీయ‌న్ నుండి హీరోగా ఎదిగిన శ్రీనివాస‌రెడ్డి పేరుతో కూడా ఓ న‌కిలి ఐడీ క్రియేట్ చేసిన ర‌వికిర‌ణ్ ప‌లువురు నెటిజ‌న్స్‌తో చాటింగ్ చేసి, వారిని మోసం చేశాడ‌ట‌. ఈవిష‌యం శ్రీనివాస రెడ్డికి చేర‌డంతో ఆయ‌న వెంట‌నే త‌న‌కి చెడ్డ పేరు తెచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని సైబరాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసుల‌ని సంప్ర‌దించి స‌ద‌రు వ్య‌క్తిపై ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీక‌రించిన వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, ఇంకోసారి ఇలాంటి నేరాల‌కి పాల్పొడ‌ద్ద‌ని హెచ్చరించారు.

2899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles