మ‌హాన‌టిలో ఎల్‌వీ ప్ర‌సాద్ పాత్ర ఎవ‌రు చేశారో చెప్పిన నాని

Sat,May 5, 2018 06:02 PM
Srinivas Avasarala as LV Prasad character intro released

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌చ్ ఎవైటెడ్ మూవీ మ‌హాన‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో అలనాటి అందాల తార‌ సావిత్రి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 9న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేకర్స్ చిత్ర ప్రమోష‌న్ స్పీడ్ పెంచారు. ఇటీవ‌ల మూవీ మేకింగ్ వీడియో విడుద‌ల చేసిన టీం తాజాగా ఎల్‌వీ ప్ర‌సాద్ పాత్ర‌లో అవ‌సరాల శ్రీనివాస్ గెట‌ప్‌కి సంబంధించిన‌ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో నాని వాయిస్ ఓవ‌ర్ చెబుతూ అవ‌స‌రాల లుక్ రివీల్ చేశాడు. ఎల్ వీ పాత్ర‌లో అవ‌స‌రాల శ్రీనివాస్ అచ్చు గుద్దిన‌ట్టు ఉన్నాడ‌ని అభిమానులు అంటున్నారు. మ‌హాన‌టి చిత్రంలో సావిత్రి పాత్ర‌ని కీర్తి సురేష్ పోషించ‌గా, జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర వాణి పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌ రాజ్, షాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకుడు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా, ప్రియాంక ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మిక్కీ జే మేయ‌ర్ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. పీరియాడిక్ బయోపిక్ గా రూపొందిన మహానటి చిత్రంలో సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను చూపించనున్నారు.

4063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles