వెరైటీ టైటిల్ ని ఓకే చేసిన అవసరాల

Sat,December 10, 2016 07:43 AM
SRINIVAS AVARASALA new movie title fixed

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా వరుస విజయాలు అందుకుంటున్న అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ రీమేక్ లో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన అడల్ట్ కామెడీ చిత్రంలో అవసరాల లీడ్ రోల్ పోషించగా ఆయన సరసన తేజస్వి మదివాడ, మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి,సుప్రియ లు హీరోయిన్లుగా నటించారు. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళీ లు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఈ రీమేక్ చిత్రం కొన్నాళ్లుగా సోగ్గాడు అనే టైటిల్ తో ప్రచారం జరిగింది. కాని తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీకి ‘బాబు బాగా బిజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో రెజీనా కసాండ్రా కూడా తళుక్కున మెరవనుందని చెబుతున్నారు.

2417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles