విక్ర‌మ్ స‌ర‌స‌న కేజీఎఫ్ భామ‌

Thu,October 17, 2019 10:56 AM

విభిన్న పాత్ర‌ల‌తో అల‌రించే విక్ర‌మ్ త‌న 58వ చిత్రంగా ఇమైకా నొడిగళ్ మూవీ ఫేమ్‌ అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మాత లలిత్‌కుమార్‌ వైకం 18 స్టూడియోస్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఇటీవలే ప్రారంభమై సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో విక్ర‌మ్ చాలా గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్న‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ చిత్రంతో మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ వెండితెర ఆరంగేట్రం చేయ‌బోతున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక చిత్రంలో క‌థానాయిక‌గా క‌న్న‌డ స్టార్ హీరోయిన్, కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారు. ద‌ర్శ‌కుడు అజ‌య్ ఈ విష‌యాన్ని క‌న్‌ఫాం చేశారు. విక్ర‌మ్ 58వ చిత్రంతో శ్రీనిధి త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతుంది. చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్ డిమోట్ కాల‌నీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. రెండో చిత్రంగా ఇమ్మైక నోడిగ‌ళ్ అనే సినిమా చేశాడు. ఇవి రెండు మంచి విజ‌యం సాధించ‌డంతో అజ‌య్ మూడో చిత్రం( విక్ర‌మ్ 58వ సినిమా)పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.




1133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles