'శ్రీమంతుడు' సైకిల్ 'కాంటెస్ట్' విజేత ఎవరు..?

Sun,November 15, 2015 03:47 PM
srimanthudu cine unit announced bicycle contest winner

ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ఎద్ద ఎత్తున విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న 'శ్రీమంతుడు' సినిమా మహేష్ బాబుకు తన కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన గుర్తింపునిచ్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు వాడిన 'సైకిల్‌'ను సినీ యూనిట్ నిర్వహించిన కాంటెస్ట్‌లో ఓ వ్యక్తి గెలుచుకున్నాడు.

'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు వాడిన 'సైకిల్' చిత్రం విడుదలకు ముందు, తరువాత కూడా ప్రతి ఒక్కరిలోనూ క్రేజ్‌ను పెంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలోనే ఆ సైకిల్‌ను మహేష్ అభిమానులకు అందజేయాలని సినీ యూనిట్ భావించింది. దీంతో వారు నిర్వహించిన ఓ కాంటెస్ట్‌లో అనేక మంది సైకిల్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు.

అయితే ఆ అదృష్టం కరీంనగర్ జిల్లాకు చెందిన జి.నాగేందర్ రెడ్డిని వరించింది. పోటీలో ఈయన విజేతగా నిలిచాడు. దీంతో హీరో మహేషే స్వయంగా ఈ సైకిల్‌ను నాగేందర్ రెడ్డికి అందించనున్నారు. కాంటెస్ట్ విజేతను ఎంపిక చేసే కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివతోపాటు చిత్ర యూనిట్‌కు చెందిన పలువురు బృంద సభ్యులు పాల్గొన్నారు.

3137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles